ఊహల లోకం

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

ఊహల లోకం

రచన: జయకుమారి

Jaya

పగలు రేయి తేడ మరిచి
నా గుప్పెడు గుండెల్లో
నువ్వు చేసే చిరు సవ్వడే.
ఉప్పెనల్లే నను ముంచేస్తుంది.

ఇది వరకు ఎన్నడు ఎరుగని
నీ ఊహలు గుసగుసలు
ఇప్పుడే ఎందుకు నాలో ఇలా

నీ నీలికళ్ళు చెప్పే ఊసులు
నా మదిని తాకే అమృతజల్లులై
నాలో పులకింతల సరిగమలు పాడుతున్నాయి.

నీ గారాల పిలుపులే
నా మనస్సును మైమరిపించే వేణుగానమైనది.
నీ చేతిస్పర్శ కి పరవశించి పోయిన
నా తనువు నీ కౌగిలిలో జాగలను మరిచి
నీ అధరం అందించే మధురసుధలలో తెలియాడుతున్నది.

నా సిగలోని విరజాజులు సన్నిధిలో
నా మది కోరిన మధుసీమను ఏలే
ఊహలను ఏలే.
నా నెల రాజువు నీవైనవు ఎప్పుడో

***

You May Also Like

One thought on “ఊహల లోకం

Leave a Reply to హసీనాఇల్లూరి Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!