ఊహలు గుసగుసలాడే
అంశము: నిన్ను దాటి పోగలనా
నులివెచ్చని ఉషోదయంలో ప్రకృతి పరవశించే…
వేళ కానీ వేళలో సరసాలు మొదలాయె.
చిరుకోపంతో నే చూడగనే…
చిరునవ్వులు చిందించావే.
నువు చెంత చేరగనే…
చలిగాలి దూరమాయే.
బిగి కౌగిలి సడలగనే…
కొత్త అల్లరి షురువాయే.
నీ వాడి చూపులు తగలగనే…
నా చెక్కిళ్ళే కెంపులాయే.
నీ కౌగిలిలో కరిగిపొమ్మని మది తొందర పెడుతుంటే,
ప్రపంచమంతా నువ్వే నాకు కనబడుతుంటే,
ఏ వేళా పాళా నిను ఆపలేక పోతుంటే,
ఈ విరహాన నిను దాటి పోవుట…
సాధ్యమేనా ఈ క్షణాన!?
రచయిత :: మౌనవీణ
Chala pleasant ga rasaru
Chala bagundhi