వెండి వెన్నెల

 వెండి వెన్నెల

రచయిత: పాండురంగాచారి వడ్ల

అడవి గాచిన వెన్నెల అని నిష్టూరమాడతారు దాని అందం అనుభవించని వారూ తెలియని వారూ..
అన్ని ఋతువులూ వారి ప్రేమకు చిహ్నాలని తెలియక..
అతడి మనసు మెచ్చిన నెచ్చెలి చెంతన చేరగా…
శరదృతువులో అడవిలోని చెట్ల ఆకుల చాటు నుండి తొంగి చూస్తున్న జాబిలి వెన్నెల..
ఆమె తెల్లని నడుము పై పడి మెరిసి వెండి వెన్నెల అవుతుండగా..
కొమ్మల నీడన చాటున దాగీదాగని ఆమె అందాలు, బుగ్గన సిగ్గునే మరిపింపచేస్తుండగా..
శిశిరంలో రాలిన ఎండుటాకులా వణుకుతున్న అధరాలు..
వసంతంలా చిగురించిన మోహావేశాలూ..
గ్రీష్మంలో వేడి కూడా భరించలేనంత వేడిని తనలో నింపుకున్న ఆమె..
తనలోని ప్రేమనంతా అతడిపై వర్షంలా కురిపిస్తూండగా..
చలిగాలులు ఆమె నిశ్వాసలో వేడి తాకి ఆవిరవుతుండగా…
ఆమెను చూసిన అతడి కళ్ళల్లో వెలుగు,
సీతాకోకచిలుక రెక్కల్లా కొట్టుకుంటున్న ఆమె కనురెప్పల చాటున కనుపాపల్లో కారుచీకటిని తరిమేస్తుండగా..
హేమంతంలో రెండు హృదయాల స్పందన ఒకే రాగం ఆలపిస్తుండగా..
అడుగేయడం మరిచిన కాలం, వారిద్దరి గాఢమైన ప్రేమను తన జ్ఞాపకాల దొంతరలో భద్రపరచే పనిలో పడింది…

You May Also Like

3 thoughts on “వెండి వెన్నెల

Leave a Reply to NALAVATH ASHOK Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!