(అంశం:: “చాదస్తపు మొగుడు”)
భిన్న ధృవాలు
.రచయిత :: రమాకాంత్ మడిపెద్ది
పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు సరిగ్గా సరిపోయే అమ్మాయిని నేను
మనం మౌనంగా ఉన్న మనం చేసే పనులు మాట్లాడాలి అని పెద్ద వాళ్ళు చెప్పే చద్దన్నం మాటలకు ఉపమానం లాంటి వాడు మా ఆయన
ఐదు నిమిషాలు కూడా కుదురుగా ఉండకుండా అస్తమానం నస పెట్టే వస పిట్టకు ఆడపడుచు లాంటి దాన్ని నేను
ఒక్క మాట మాట్లాడాలన్నా ఒకరిని ఓ మాట అనాలన్నా వంద సార్లు ఆలోచించే మనిషి ఆయన
సాంఘిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ రంగుల ప్రపంచంలో బతికే అసలైన ఈ తరం అమ్మాయిని నేను
సామాన్య దినచర్యతో ప్రశాంతమైన సగటు జీవితాన్ని కోరుకునే వ్యక్తి ఆయన
అనుకుంటే కావాలనుకుంటే తన్నైన సాధించుకునే తత్వం నాది
తప్పు అటు వైపు ఉన్న తప్పుకు పోయే వ్యక్తిత్వం ఆయనది
ఇలా అభిరుచుల నుండి అభిప్రాయాల వరకు ఇన్ని తేడాలు ఉన్నా మనుషులు మనస్తత్వాలు
భిన్న ధృవాల ఉన్న మా మధ్య ఆకర్షణే తప్ప వికర్షణా ఎప్పుడు లేదు..
ఆప్పుడప్పుడు ఆయన చెప్పే మాటలు పాత చింతకాయ పచ్చడిలా వయసుకి వచ్చిన కొత్తలో అమ్మాయిలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని మా అమ్మమ్మ మాటల్లా చాదస్తంగా ఉన్నా
నాకు కొంచమ్ నతల ఉన్నప్పుడు ఆఫీసుకి సెలవు పెట్టీ మరి అమ్మ లా చూసుకోవడం రాత్రిళ్ళు పిచ్చి పిచ్చి సినిమాలు చూసి నిద్ర లో ఉలికి పడి లేచినప్పుడు నా పక్కనే ఉండి నాన్నలా భుజం తట్టి ధైర్యం చెప్పడం..
నా అల్లరినీ భరించడం
నేను చేసే తప్పులకి నొచ్చుకోకుండా చిన్న చిరు నవ్వుతో క్షమమించడం
ఇలా ఒక్కేమిటి చెప్పుకుంటూ పోతే చెప్పినంతా మీకు వినే ఓపిక ఉంటే ఆ ఓపికకే చిరాకు వచ్చేంతా ఉన్నాయి.
అవే ఆయనకు నాకు మధ్య దూరం అనే మాటనే దూరం చేసింది. ఆయనలో ఎదో ఉన్నా ఆకర్షణ నన్ను తనవైపుకు లాక్కుంది.
బహుశా ఆ ఆకర్షణే పేరు ప్రేమెనేమో…
ఈ ప్రేమకు మరోపేరు నమ్మకమేమో..
పెళ్ళై మూడేళ్లు అయినా పిల్లలు అనే ఊసు లేకపోయినా మా బంధం బలంగా నిలబడడానికి కారణం ఆ నమ్మకమనే పునాదేమో…..
Well narrated Sir
Super my dear friend
అల్లరి పెళ్ళాం – అణుకువ మొగుడు
OPPOSITE POLES ARE ATTRACTED EACH OTHER
Nice writes Ramakanth garu.👌👌👏👏👍
Chala baagundi brother
Super
Good raa
Comments avasaram ledu bigiluu chimpesav🔥🔥
Short and sweet, nice brother …
Chala bagundi ramakanth
Bagundi ramakanth writing style super. Ilaanti baryabarthalu chala mandi unde untaru…
Realistic ga undi
Osm Mamu🤝.
Superb brother
భిన్న ధృవాలు
కలిస్తేనే కదా సర్ అందం..మీరు చాలా బాగా రాశారు..
Pitta konchem kootha ghanam… apt for you.😉👌