మరదలుపిల్ల

(అంశం :: మనసులు.దాటని ప్రేమ)

 మరదలుపిల్ల

రచయిత్రి :: సుజాత.కోకిల

అప్పుడే వచ్చిన సందీప్ ను బావ, అత్తయ్య నిన్ను రమ్మంటుంది అంటు వచ్చింది మనస్విని.ఎందుకు అంటు కండువాను భుజంపై వెసుకుని కాళ్లుచేతులు కడుకుంటూ తన వైపు చూసి చూడనట్టుగానే అడిగాడు సందీప్ ఏమో.నాకు తెలియదు అత్తయ్యనే అడుగు అంటు మూతి ముడుచుకుంటూ వెళ్లింది.

ఇది ఏదో మళ్లీ నాపై పప్పురుబ్బింది అనుకుంటూ లోపలికి వెళుతూ ఎంటమ్మ పిలిచావుట అవును నాన్న పిలిచాను మనస్విని రాకరాక వచ్చింది అది బస్తీలో
పెరిగిన పిల్ల ఇక్కడ నాకు బోరు కొడుతోంది అత్తయ్య అంది మన ఊరు తోటలు పొలాలు చూపించరా దానికి
కాస్తా కాలక్షేపంగా ఉంటుంది అంది తల్లి శాంతమ్మ అది అడిగితే తీసుకువెళ్లను అన్నావుట అందుకే నాతో చెప్పిందిర ఎందుకురా పాపం దాన్ని ఎడిపించడం అయ్యో అమ్మ అది నీకు అలా చెప్పిందా
అన్నాడు.

దానికి అంటే బుద్దిలేదు మరి నువ్వు కూడ ఎంటమ్మ నా కంటే మీ అన్నయ్య కూతురే ఎక్కువైందా నన్ను నమ్మవా.అమ్మ అన్నాడు నవ్వినవ్వనట్టుగా అలా కాదు నాన్న ఇంకా నాకు ఏమ్ చెప్పకు నీ మేనకోడలికి ఇంట్లో బుద్దిగా వంట వార్పు పని నేర్పు ఇదేమన్నా సిటీన తిరగడానికి ఇక్కడ ఎమ్ ఉంటాయి.అన్నాడు కోపంగా మనస్విని ఇంక ఉడికిస్తూ సందీప్

అత్తయ్య చూడు బావ అంది వాడి మాటలు నువ్వు ఎమ్ పట్టించుకోకే,అంది అమ్మ అలా కాదు బస్తీకి ఇక్కడికి చాల తేడా ఉంది.ఎ.సీ. లు అలవాటు ఉన్నవాళ్లకి ఇవి నచ్చవు ఇక్కడ అంతా మట్టి పేడవాసనలే కదా ఉండేవి తనకి ఇష్టం ఉంటుందో లేదోనని.అన్నాను అమ్మ.చూడు.అత్తయ్య నేను అలా అన్నానా అంటూ అత్తయ్య వెనుకాల వెళ్లి రెండు చేతులు భుజాలపై వేసి బావ వైపు కళ్లతోనే చూస్తూ బాగయిందా అన్నట్టుగా చూసినవ్వింది మనస్విని.

నేను కూడ చిన్నప్పుడు అంత తిరిగినదాన్నే తెలుసా అంది బెదిరింపుగ ఒ ఓ అలాగ నీ పని చెపుతాను ఉండు అంటు మనస్విని పట్టుకోవడానికి ముందుకు వచ్చాడు అత్తయ్య అంటు పరుగెత్తింది.ఆగు అంటు తన వెంట పరుగెత్తాడు ఒక్క ఉదుటున పట్టుకుని చెవి మెలిపెడుతు ఇంకోసారి నాపై చాడీలు చెపుతావ అంటు బుగ్గపై ఒకటి ఇచ్చాడు ఆ..బావ చెప్పను నా చెవి నొప్పి పెడుతుంది వదులు బావ అంది.

మరి నీతో తోటకు తీసుకు వెళ్లాలి సరే మరదలు పిల్ల అంటు విడువ బోయాడు తన షర్టు గుండికి తన వెంట్రుకలు.చిక్కుకున్నాయి ఆ బావ ఆగు అంది తన వెంట్రుకలు తీయ్యబోతు ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ఉండి పోయారు బావ కళ్లల్లో ఎదో తెలియని ఆకర్షణ ఉంది తను.కూడ కోంటే చూపుతో ఎలా వెలుతావొ వెళ్లు అన్నట్టుగా చూసాడు సందీప్ .నాకు చాల సిగ్గుగా ఉంది బావ అంటు వెంట్రుకలను విడదీసి చెంగున పరిగెత్తింది.ఎమ్మ మీ దెబ్బలాటలు సద్దుమణిగింద అని అడిగింది.ఆ.ఆ అంది మీ మామయ్యకు కాఫీ పెట్టాలమ్మ అంది తన టైం అయిందంటే ఒకక్షణం కూడ ఊరుకోరు ఒకటే గొడవ చేస్తారమ్మ అంది.

అత్తయ్య నేను కాఫీ పెడుతాను మామయ్యకు అంది ఎందుకులేమ్మ నేను పెడుతాను అదేమ్ లేదు నేనే పెడతాను సరేతల్లి పెట్టు అంది కాఫీ చేసి అత్తయ్యకు ఇచ్చి మామయ్యకు నేనే ఇస్తాను అంటూ మామయ్య గదిలోకి వెళ్లి.మామయ్య వేడి వేడికాఫీ తెచ్చాను అంటూ కాఫీ అందించింది నీవు ఎందుకు తెచ్చావమ్మ మీ అత్తయ్య ఎమ్ చేస్తుంది తనే ఇస్తానంది కాని నేను ఇస్తాను లే అత్తయ్య అన్నాను సరే అంది.మామయ్య కాఫీ.ఎలా ఉంది మామయ్య నేనే చేసాను అంది బ్రహ్మండంగా ఉందమ్మ మీ అత్తయ్య చేసేదాని కంటే నీవు చాల బాగ పెట్టవమ్మ అంటూ నవ్వారు అవున మామయ్య అవునమ్మ థ్యాంక్యూ మామయ్య అంటు కాఫీ కప్పు తీసుకుని వెళ్లింది.బావకు ఇచ్చార అత్తయ్య లేదమ్మ సరే ఇస్తాను లేండి అంటు కాఫీ కప్పుతో వెళ్లింది.

వసారలలో ఈజిచేర్లో కుర్చోని పేపర్ చదువుతున్నాడు . బావ ఆరుఅడుగుల అందగాడు చక్కని మీసంకట్టు తెల్లపంచే పింక్ కలర్ గల్లషర్టులో అందంగా కనిపిస్తున్నాడు వ్యవసాయ చేసిన.ఒళ్లు కద దృడంగా పుష్టిగా ఉన్నాడు పెద్ద చదువులు చదివి కూడ సిటీ వాతావరణం నచ్చక అగ్రికల్చర్ బి.ఎస్సీ చేసి.తన స్వంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు తనకింద
పదిమంది మనుషులను పెట్టుకుని. మంచి రాబడితో రైతుబజారులో ఎగుమతి చేస్తుంటాడు బావ పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు చేప్పిన వినిపించుకోడు.ఈ సంవత్సరంతో నా డిగ్రీ కూడ అయిపోయింది.

నాకు బావ అంటే నాకు చాల ఇష్టం బావ మనసులో ఎమ్ ఉందో పైకి ఎమ్ కనిపించడు రేపు బావతో తోటకు వెళ్లాలి రేపు అన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంది . మనసులో బావ కాఫీ అంటూ చేతికి అందించింది బావ అంది చెప్పు అన్నాడు తల ఎత్తకుండానే కాఫీ సిప్ చేస్తు రేపు మనం పొలంకు వెళుదామ్ బావ అంది . సరే అన్నాడు బావను ఇంత ఈజీగా ఒప్పుకుంటాడని
అనుకోలేదు ఏమి అయితేనేమి ఒప్పుకున్నాడు అంతే చాలు మనసులో అనుకుంది కాఫీ తాగి.కప్పు ఇచ్చాడు .అయ్య అంటు పాలేరు కొమరయ్య వచ్చాడు.

ఎంటి చెప్పు కొమరయ్య అన్నాడు మా ఇంటీదానికి సుస్తిగ ఉందయ్య బెగిరమే వెళ్లాలి అందుకే నీళ్లు చళ్లి పక్కలు వేసానయ్య వెళ్లోస్తాను గొడ్లకు కూడ.మేత కుడితి పెట్టే వెళుతున్నాను అయ్య అంటూ చెప్పాడు అవున అయ్యో ఇప్పుడు ఎలా ఉంది బాగానే ఉందయ్య వెళ్లు అన్నాడు రోజు వాకిట్లోనే పడుకుంటారు అందరు ఆరుబయట.ఎంత చల్లని గాలిలో ఎంత బాగ నిదుర పడుతుంది

తొందరగా భోజనాలు కానిచ్చి.అందరు వాకిట్లోకి వచ్చారు ఎవరి పక్కలో వాళ్లు పడుకున్నారు పల్లెటూర్లో పెందలాడే పడుకుంటారు మళ్లీ తెల్లవారుజామున్నే లేస్తారు కనుక ఊరు అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. తనకు నిదుర రావడం లేదు కొత్త వాతావరణం లేటుగా పడుకోవడం అలవాటు బైట పడుకోవడం అలవాటు లేదు.ఆకాశంలోని చంద్రుడు మబ్బుల చాటునుండి దోభూచులు.ఆడుతున్నాడు చెట్లు.పున్నమి వెన్నెలలో వింత శబ్ధాలు చేస్తూ మనసును ఆహ్లద పరుస్తోంది బావ వైపు చూసింది గుర్రు పెట్టి నిదురపోతున్నాడు. అలా ఆలోచిస్తు నిధురలోకి జారుకుంది.

మల్లి రాజమ్మ పిలిచేదాక తెలివి రాలేదు.అమ్మ జానేడు పొదెక్కింది లెగమ్మ.కల్లాపు చల్లాలి అంటు లేపింది. అమ్మో ఇంత పొందేక్కింద అంటు గబుక్కున లేచింది. అక్కడ లేటుగా లేవడం అలవాటు కొత్త కనుక తొందరగా నిదురపట్టలేదు ఆరుబయట ఇంత లేటుగాన లేవడం అనుకుంటు తనదితానే సిగ్గు పడింది .బావ ఎమ్ అనుకుంటాడోనని అమ్మ మనస్విని రామ్మ
టీ అయింది మొహం కడుక్కొని రా అంది. సరే అత్తయ్య అంటూ వాష్ రూమ్ కి వెళ్లి ప్రేష్ అయ్యి వచ్చింది.

టీ ఇస్తు నాన్న ఫోన్ చేసారు అమ్మ అంది ఎందుకు అత్తయ్య ఎందు కేంటే మొద్దు మీ బావను.అల్లుడిని చెసుకోవడానికి.వస్తున్నారు మొద్దుపిల్ల నీకు బావకి పెళ్లి.మీ ఇద్దరికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికి మీ నాన్న నిన్ను ఇక్కడికి  పంపించాడు.మీ ఇద్దరికీ ఇష్టం అని తెలిసి పోయింది.

అందుకే ఇక్కడి విషయాలు అన్ని నాన్నకు.చెప్పాను అందుకే రేపు తెల్లవారుజామునే వస్తున్నారు మరి బావ అంటే నీకు ఇష్టమేనా కాద అంది పో అత్తయ్య సిగ్గు పడుతు అంది.అమ్మయ్య ఎ కష్టం లేకుండానే బావతో పెళ్లి కుదిరింది.ఎన్ని అవస్తలు పడాలో అనుకుంది. అప్పుడే బావ వచ్చాడు బావను చూస్తే ఎదో తెలియని అనుభూతి ఎదొ మనసును కలవరపెడుతుంది.బావ
పొలంకు రా అన్నాడు సరేనని అత్తయ్య బావతో నేను పొలంకు వెళుతున్నాను సరేతల్లి త్వరగా రండి అలాగే అత్తయ్య తన ఆనందం ఇంత అంతకాదు బావతో పక్కపక్కగా పొలాలగట్లపై భుజం భుజం తాకుతు నడుస్తుంటే మనసు పులకరించి పొతుంది శరీరంలో ఏదో అయస్కాంతం వచ్చినట్టుగా మనసు పరవళ్లు తొక్కుతుంది. బావ అంటు చేయి పట్టుకుని భుజంపై వాలి నడుము పట్టుకుని నడుస్తుంది.

బావ నేనంటే నీకు ఇష్టమేనా నీవు ఇష్టపడ్డావు కద మరదలు పిల్లను నేను ఇష్టపడకుంటే ఎలా ముక్కును ఇలా పిండేస్తుంది నా మరదలు అంటు ముక్కును పట్టుకుని చూపిస్తున్నాడు చీ పో బావ అంది ఎక్కడికి పోయెది ఇంక నా మరదలు నన్ను వదిలి పెట్టదుగ అన్నాడు నవ్వుతూ ఇంక నీ కోరిక తీరింద అన్నాడు. సందీప్ అవును బావ నీతో ఇలా రావడం త్రిల్లుగా ఉంది బావ ఇ ముమెంట్ ఎప్పుడు మరిచిపోను బావ అంది సంతోషంతో పశువులు ఇంటికి వచ్చేటైమ్ అయింది పద అన్నాడు.ఇద్దరు ఆడుతుపాడుతు ఇంటికి వెళ్లారు.వీళ్లు ఎదురు చూస్తున్న గడియ రానే వచ్చింది.అమ్మ నాన్న వచ్చారు.కుశలప్రశ్నలు అడిగారు . విందు భోజనాలు అయినాయి.

అమ్మ మనస్విని అమ్మనాన్నను అప్పుడే మరిచి పోయావ పెళ్లి అయ్యాక బొత్తిగా మరిచి పోతావ అంది తల్లి కనకం అది ఎమ్ లేదమ్మ అత్తయ్యతో ఉంటే టైమే తెలియడం లేదమ్మ అంది సంతోషంతో మనస్విని మీ అత్త అప్పుడే ప్రేమతో నీన్ను కట్టివెసింది నవ్వుతూ అంది తల్లి కనకం అందరు సరదాగా నవ్వుకున్నారు. పెళ్లి ముహుర్తాలు చుసుకున్నారు. ఈ నెలలోనే ఉన్నాయి మల్లి లేవు అన్ని మూడాలు ఉన్నాయి.

ఈ నేల 26న దివ్యమై ముహూర్తం ఉంది అన్నారు
శాస్ర్తీగారు అదే నిర్ణయించండి అన్నారు సందీప్ నాన్నగారు ఈ పెళ్లితో ఇళ్ళంతా కలకలలాడుతుంది. పెళ్లి బాజాలు మోగాయి .మనస్విని పెళ్లి కూతురుగా అలంకరించుకుని కళ్యాణవేధిక పైకి వచ్చింది సందీప్. పెళ్లికొడుకుగా ముస్తాబై వేధికపైన కుర్చోని ఉన్నాడు బందువుల సమక్షంలో వేధమంత్రాల సాక్షిగా సందీప్ మనస్విని.మెళ్లో తాళి కడుతు. సిగ్గుపడుతున్న మనస్విని వైపు చుసాడు ఆరాధనగా తనవైపు చూస్తు నవ్వి నవ్వనట్టుగా నవ్వింది.తన బుగ్గలు ఎరుపు ఎక్కాయి బావామరదళ్ళు మూడుముళ్లబందంతో ఒకటైయ్యారు వారి జీవితం మూడు పువ్వులు ఆరుకాయలు కావాలని అశిద్దాం ఒక మంచి ముహుర్తం లో సంసార జీవితంలోకి అడుగు పెట్టారు.పడ్డంటి బిడ్డను కన్నారు. ఆ ఇల్లు ఆనందాల హరివిల్లులుగా మారింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!