లోలోపల గాయాలు
రచన: బుదారపు లావణ్య
అయిన వాళ్ళు ఎందరు ఉన్న
ప్రేమగా పలకరించే వారే కరువై
అందరూ ఉన్న ఒంటరిలా
మదిలోనే రోదిస్తూ
కాలు బయట పెట్టిన
కంటి చూపుతో కాల్చుకు తినే
కామాంధుల నడుమ
కరిగి కన్నీరై పోతూ
ప్రేమ పేరుతో
ప్రతిక్షణం వేధించే
పురుషోత్తమధ్య
లోలోపలే కుమిలిపోతూ
మాటల మాటున మాటిమాటికి
మీద చెయ్యి వేస్తూ
భుజాలు నలిపే
బరితెగించిన బాసుల నడుమ
నిరంతరం నలిగిపోతూ…
మనసు లోపల గాయాలు బాధిస్తున్న లోలోపల దుఃఖం ముంచేస్తున్న
చెరువులో చేప పిల్లలా
చీకట్లను ఈదుకుంటూ
బరువెక్కిన గుండెతో
బతుకు సాధించే
వనితలు ఎందరో ఈ జగతిన.
Bagundi 👏👏