మనసు “ఆట”

మనసు “ఆట”

అంశం : నిన్ను దాటి పోగలనా

ఒడలు నాదైనా
చేసే తుంటరి స్వారీ నీది
మాటలు నావైనా
వినిపించే గొంతు నీది
నీకు నచ్చిన చోట కూర్చోబెడతావు
నచ్చకపోతే పల్లేరుకాయల మీద కూర్చున్నట్లుందనిపిస్తావు  నిన్ను కాదనగలనా??
మనసా నిన్ను దాటి పోగలమా???
తినే తిండి, కట్టె బట్ట
ఉండే చోటు,చదివే చదువు
తిరిగే బండి,వాడే ఫోను
స్నేహితులు,బంధువులు
అన్నీ నువ్వు ఏరుకున్నవే
నాది అనుకునుడే కానీ
నిశ్చయం నీదే…కాదని
మనసా…నిన్ను దాటి పోగలనా???
నేను కన్పించి
నువ్వు కనిపించక
తోలుబొమ్మలాట ఆడిస్తావు నన్ను
నువ్వు సంతోషంగా ఉంటే నేను నవ్వుతాను
నువ్వు బాధపడితె నేను ఏడుస్తాను
లోపల ఉండి చర్యలు నువ్వు చేస్తే
బయటి ప్రతిచర్య నేనవుతాను
నీ సంతృప్తి నన్ను పరిపూర్ణున్ని చేస్తుంది..అలాంటిది
మనసా.. నిన్ను దాటి పోగలనా???

రచయిత :: చెటుపెల్లి పుష్పలత

You May Also Like

2 thoughts on “మనసు “ఆట”

  1. చాలా బాగుంది
    ఎలాంటి రచనలు మీరు ఇంకా రాయాలి

Leave a Reply to Sahithi Sudhakar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!