మనసు లోని భావన

మనసు లోని భావన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పుష్పాంజలి

బిక్ష్యం ఎత్తుకునే జంగమదేవర ఆయన ప్రేమలో సతీదేవి దక్ష్యాప్రజాపతి కూమారై. ఓం నమశివాయః ఓం నుండి ఓంకారం పద శబ్దం నుండి వెలవడే ద్వని ఈ ఓం..ఓం నమఃశివాయ హరా హరా మహాదేవా శంభోశివ శంకరా సృష్టి స్దితి లయకారుడు ఆ పరమశివుడే కదా. గంగాతరంగ రమణీయ జటాకలాపం అంటే వలచి వచ్చిన గంగాదేవిని తలమీదా తన జడలో బంధించి గంగాధరుడు, నెలవంకా (శశిని )తలమీదే వుంచి శశిధరుడు, కఠమున నాగరాజునే ధరించి నాగభరణుడు, పాలకడలిలో పుట్టిన హలహలము కంఠంలో బంధించిన నీలకంఠడై తన శరీరములో తన సతికి అర్థభాగము ఇచ్చే అర్థనారీశ్వరుడై  నందిని వాహనముగా చేసుకొనే  నంధీశ్వరుడై అయినారు. ఆ దేవాధిదేవుడు మహాదేవుడు. ఓ శివా అనే వెలుగెత్తివారికి నీ పక్కన నేను వున్నా అనే వరం ఒసిగే భోళశంకరుడువ నీవు సతిదేవి మరణంతో కోపాగ్ని దుఃఖభరితమై తన మూడోకన్ను తెరిచిన దక్ష్యప్రజాపతి తలను వేరుచేసిన తినేత్రుడువే కదా ( కోపముతో నృత్యం)  రుద్రతాండవం చేసే కైలసావాసా. హిమరాజు పుత్రిక (గిరిజ) పార్వతిని పెళ్లాడి పార్వతి పరమేశ్వరులు అయినారు ఈజగతిలో భక్తులు పాలిట కరుణరసం కలిగిన ఆదిదేవుడువు నీవు. ఒక భక్తురాలు మనసు ఈశ్వరుడుని ఇలా ప్రార్థన చేస్తుంది.
ఓ స్వామి ఓ శివా ఓ నీలకంఠ ఓ నాగభరణ
ఓ తినేత్ర , ఓ శశిధరా, ఓ అర్దనారిశ్వరా, ఓ నంధీశ్వరా, ఓ గంగాధరా, నీలో చేరాలంటే నాకు
చోటు ఎక్కడ వుంది ? నాకు చెప్పు తండ్రి
ఓ భక్తవత్సాలా. నీ తలమీద వుందాం  అంటే నెలవంక, గంగాదేవి నా వంక గుర్రుమనే చూస్తున్నారు. నీ నేత్రాలు అందునే వుందమన్నా (భక్తులు)సకలజీవుల పాపపుణ్యాలు చూడాలి పైగా నీకు తినేత్రం వుంది ఎప్పుడూ ఆ త్రినేత్రం తెరుస్తావో తెలియదు. కఠము దగ్గర వుందాం అంటే నావైపు నాగభూషణం హలహలం చిమ్ముతూ వుంది. నీ హృదయం అంతా గౌరీదేవి ఆక్రమించే  నీచేతిలో ఢమరకం, త్రిశూలం  నీ కాలియందు అంటే నీ అందెలు ఎప్పుడూ నిన్ను అంటి పెట్టుకున్నాయి. నీ ముందరే నందీశ్వరుడు  మరి నాకు ఎక్కడా చోటు ఇస్తావు ? లయకారా కరుణసాగరా. నీ తలమీదా, పాదం చెంతా వుంచే  పుష్పంనై నీ హారతి నై నీకు అంజలి ఘట్టిస్తూ  సదా నీతో నీలో వుండాలి అని, కోరుకునే భక్తురాలు నీ పుష్పాంజలి మనసు ఇదే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!