నా ఊపిరి నా నేస్తం

(అంశం : నా అల్లరి నేస్తం) 

నా ఊపిరి నా నేస్తం

రచన ::జయకుమారి

ఉదయాన్నే విచ్చుకొనే కుసుమంలా
పసిపాప బోసినవ్వులా.!!

తుళ్ళిపడే పిల్ల గోదారిలా..
నను మైమరిపించే పైరుగాలి లా.!!

నిశిని సాగనంపి వెలుగులు తెచ్చే రవికిరణంలా.
సంధ్య సమయంలో తొంగి చూసే నెలవంకలా.!!

నా కోసం తపన పడే హృదయం.
నా కోసం ఆరాటపడే నా నేస్తం.!!

నను అల్లరి చేసే ఓ తీయ్యనైన స్నేహం.
నను వెన్నెలలో చూసి మురిసె నా ప్రియ నేస్తం.!!

చిన్నగా మొదలై తరగని ఆనందం లా
నను మాయగా అల్లెసిన నీ స్నేహం.!!

నా తుది శ్వాస వరకు నాకు ఊపిరైన
నా నేస్తం నాకే సొంతం.!!

You May Also Like

2 thoughts on “నా ఊపిరి నా నేస్తం

Leave a Reply to హసీనా Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!