అంశం: హాస్యం
నాటి నాయుడు – అప్టుడేట్ ఎంకి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్యపత్రిక)
రచన: కవిత బేతి
ఆకాశం దించాలా నెలవంకా తుంచాలా..
అంత కష్టమెందుకులే, అమెజాన్ లో ఆర్డర్ పెట్టుమావా!
చామంతి పువ్వా పువ్వా నీకు బంతిపూల మెడకట్టనా..
రెండో రోజుకి వాడి వడలి పోతాయి,
గేటెడ్ కమ్యూనిటీలో విల్లా బుక్ చేయి మావా!
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నదీ..
డిస్కోథెకెళ్ళి ఆడీ పాడీ అలసిపోయాను, స్పాకెళ్ళొస్తా మావా!
నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు..
అయ్యో వ్యాక్సింగ్ చేసుకోలేదు, బాగా గుర్తు చేసావు మావా!
నీవేనా నను పిలిచినది నీవేనా నను తలచినది..
నేను కాల్ చేయలేదే, కాలర్ ఐడి లేదా మావా!
పంటచేలో పాలకంకి నవ్విందీ, పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ..
అమెరికన్ స్వీట్ కార్న్ అయితే బాగుటుంది కదా మావా!
వీణ వేణువైన సరిగమ విన్నావా..
కొత్త ట్రాకా, అయితే విందాం, అలెక్సాకి చెప్పు మావా!
అబ్బా… అప్ డేట్ అవ్వు మావా!
Super