పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

                               పల్లె పట్నం గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు వ్యక్తులు. బాబు తమరిది ఏ ఊరు?హైదరాబాద్,నీది?మది సిరిసిల్ల జిల్లా లో పల్లెటూరు .మీరు పల్లెల్లో ఎలా బతుకుతారు.మీకు కరెంటు ఉండదు.వేసవి కాలంలో ఉక్కపోత వుంటాది కదా!హాయిగా ఆరుబయట మంచాలు వేసుకొని మా విధి వాళ్ళందరం కబుర్లు చెప్పుకుంటు పడుకుంటాం.చాలా చల్లగా ఉంటుంది. హోటల్స్ ఉండవు కదా!కొత్తవారిని ఆదరించి కడుపు నిండా తిండి పెడతాం వసతి కల్పిస్తాము.ఇంకా హోటల్స్ ఎందుకు అంది ఈగ?హాస్పిటల్ ఉండవు కదా!కష్టపడి పనుకు చేసుకుంటం, సాధారణంగా ఏ జబ్బులు రావు మాకు.వచ్చిన చిన్న డాక్టర్ లు వుంటారు.పెద్ద జబ్బుయితే పట్నం వెళ్లి చూపించుకుంటాము.అయితే మా పట్నం కంటే మీ పల్లెటూరే బాగుంటుందా?ఒకసారి వస్తే మళ్ళీ విడిచి పెట్టారు.ఈ రణగొణ ధ్వనులు ,కాలుష్యం ఇవేమీ ఉండవు.హాయిగా ఉంటుంది.మా పట్నంలో జన సమ్మర్థం,హోరు ఎక్కువ,ఇనపెట్టేళ్లంటి ఇరుకు ఇండ్లలో మురికివాడల్లో సామాన్యులు నివసిస్తారు. ఉపాధి కోసం పల్లెలను వదిలి నగరాలకు ప్రజలు వాస్తు ఉంటారు. రోడ్లన్నీ ఉదయ సాయంత్రలలో కన్వెoటు పిల్లలతో నిండిపోతాయి .పిల్లల బస్సులతో ఆటోలతో నిండిపోతాయి.నగరాలలో ఎక్కువగా భవంతులు ఎక్కువగా ఉంటాయి.పట్నంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ. నగరంలో ప్రజలు ఎవరికి వారు ఒంటరిగా బ్రతుకుతము.మా పల్లెల్లో జనాభా ఎక్కువ ,ప్రశాంతంగా ఉంటాయి.విశాలమైన పెంకుటిండ్లలో ప్రజలు నివసిస్తారు.సామాన్యులు పురిళ్లలో ఉంటారు. పల్లెలోని యువకులు  అంతా ,పల్లెలను వదిలి ఉద్యోగాల వేటకు నగరాలకు వలసపోతున్నారు.పురిల్లు ఎక్కువ భవంతులు తక్కువ,పల్లెల్లో ప్రజలు ఎక్కువగా పాదచారులు. కొద్దిగా వాహనాలు ఉంటాయి.పల్లెలో రోడ్డు ప్రమాదాలు బహు తక్కువ.పల్లెల్లో ముఖ్య వృత్తి వ్యవసాయం.పల్లెలో ప్రజలు ఐక్యమత్యంగా కలిసి మెలసి అన్నదమ్ముల్లా జీవిస్తారు.పచ్చని చెట్ల ,పంటపొలాల మా పల్లెలు,బడులు, గుడులు చక్కని బాటలు,ఆప్యాయత ,అనురాగాల ,పండుగలు ,పేరంటాలతో మా పల్లెలు కళాకాళలాడుచు సిరిసంపదలతో విలసిల్లు తుంది.నా చిరునామా ఇస్తాను.తప్పకుండా రా మా ఇంట్లో ఉందువుగాని.మీతో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది.తప్పక వస్తా.నేను వెళతాను ఈగ బై. మంచిది బాబు !జాగ్రత్తగ….

రచయిత::దుబ్బాక శివకళ్యాణి

You May Also Like

One thought on “పల్లెటూర్లు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిళ్ళు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!