చిన్నారి సోని కథ

చిన్నారి సోని కథ

రచన:ఎన్.ధన లక్ష్మి

” సోనీ 10 ఏళ్ళ పాప…ఆడుతూ, పాడుతూ తన ఫ్రెండ్స్ బంటి,విన్నీ తో కలిసి స్కూల్ కి వెళ్ళేది.. ఓ రోజు బంటి వేరే ఊరికి వెళ్లి ఉంటాడు..విన్నీ కి జ్వరం వచ్చి ఉంటుంది ..
సోనీ అమ్మ,నాన్న రోజువారీ కూలీలు…
వర్షం వచ్చేలా ఉంది అన్నీ గొడుగు తీసుకొని స్కూల్ కి వెళ్తుంది చిన్నారి సోనీ.. వాళ్ళ నాన్న చెప్పి ఉంటారు . చదువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు అని..పైగా ఆ రోజు పరీక్ష ఉంది అని ..
దారిలో ఓ 45 వయసు వ్యక్తి కిడ్నాప్ చేసి పాడు చేసి వెళ్ళిపోతాడు. ..
ఒంటి నిండ గాయాలు ఉన్న వాటిని లెక్కచేయకుండా దగ్గరిలో ఉన్న స్కూల్  దగ్గరికి చేరుకుంటుంది..విషయం అర్థం చేసుకున్న హెడ్ మాస్టర్ సోనీని హాస్పిటల్ లో జాయిన్ చేపించి వాళ్ళమ్మ ,నాన్నకు కబురు పంపారు.వారి చిన్నారి బిడ్డను ఆ పరిస్థితిలో చూసి కన్నీరు మున్నిరు అవుతారు..
పాప అమ్మ,నాన్న పరిస్థితిని అర్థం చేసుకొని స్కూల్ యాజమాన్యం వాళ్ళు హాస్పిటల్ ఖర్చులు చూసుకున్నారు.
సృహా  వచ్చాక వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాలి అన్న భయపడేది..నిద్రలో నన్ను ఏమి చేయద్దు అంటు వెక్కి వెక్కి ఏడిచేది..ఆ తల్లి దండ్రుల వేదన వర్ణనాతీతం…
బంటి,విన్నీ ఎప్పుడు సోనీ దగ్గరికి వస్తూ అడుకునేవారు..స్కూల్ లో  జరిగిన పాఠాలను వివరించేవారు.. సోని కూడా కొద్ది కొద్దిగా జరిగిన సంఘటన నుంచి బయటపడ  సాగింది..
ఓ లేడీ పోలీస్ వచ్చి సొనీతో ” కన్న నువ్వు పడ్డ బాధ ఇంకోకరు పడకూడదు అన్న,నిన్ను ఇంతలా హర్ట్ చేసినవారికి శిక్ష పడ్డలి అన్న నీ సాయం చేయాలి చేస్తావా…”
“సోనీ హా! ఆంటీ ఆ బ్యాడ్ అంకుల్ కి శిక్ష పడాలి.. మీరు బాగా కొడతారా కదా”
” హా!ఈ ఆంటీకి ఆ బ్యాడ్ అంకుల్  చూడడానికి ఎలా ఉంటారో వివరించి చెప్పాలి”
” సోనీ ఏడుస్తూనే పోలికలను అక్కడికి వచ్చిన ఆర్టిస్ట్ కి  చెపుతుంది..”
” అతని ముఖచిత్రన్ని  అన్నీ పోలీస్ స్టేషన్ కి పంపించి వెతుకులాట మొదలు పెడతారు”
” సోనీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేది కాదు అని దూరం నుంచి చూస్తూ మాట్లాడేది”
సోనీ మెల్లిమెల్లిగా స్కూలుకి కూడా వెళ్ళడం మొదలు పెట్టింది
” సోనీకి జరీగినట్టు ఇంకా ఏ చిన్నారి పై జరగకుండా ఉండలి అని భావించి వారికి  కరేటే నేర్పించారు స్కూల్ వాళ్ళు.
ఎప్పుడు బ్యాగులో పెప్పర్ స్ప్రే, కారం పెట్టుకోవాలి..
అలాంటి సందర్భంలో ఇరుక్కున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి.. రకరకాలుగా పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పారు”
“వర్షాకాలం అని పిల్లలు అందరిని త్వరగా ఇంటికి పంపించారు స్కూల్ వాళ్ళు.బంటి,విన్నీ స్కూల్ నుంచి వస్తుంటే బ్యాడ్ అంకుల్ టీ కొట్టు దగ్గర  కనపడ్డారు.వాళ్లకి ఏడుస్తూ చెప్పింది . దగ్గర్లో కనపడ్డ ఓ ఆంటీకి విషయం చెప్పి ఆవిడ సాయంతో పోలీసులకి సమాచారం అందించి.బ్యాడ్ అంకుల్ దగ్గరికి వెళ్ళి నిలపడ్డారు.సోనీ,బంటి,విన్నీ”
అతను తాపీగా టీ తాగుతుంటే కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి ,ఆ ఆంటీ సాయంతో కట్టేస్తారు. ఏ వర్షంలో సోనీ జీవితాన్ని నాశనం చేసాడో అదే వర్షం సాక్షిగా పోలీసులకు అప్పగించారు పిల్లలు సోనీ,బంటి,విన్నీ ”
” బ్యాడ్ అంకుల్! పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు..చట్టంలో ఉన్న లోపాలను వాడుకొని జైల్ నుంచి బయట పడ్డాడు కేవలం ఒక నెల జైల్ శిక్ష అనుభవించి”
” సోనీ విషయంలో జరిగినట్టు ఏ చిన్నారి విషయంలో జరగకూడదు.. ఇలాంటి రాక్షసులు బయట ఉంటే ఏదో ఒక రోజు మరో చిన్నారి బలికాక తప్పదు అని భావించిన సోనీ తండ్రి పథకం వేసి విపరీతంగా టార్చర్ చేసి మరీ చంపేశాడు.”
” తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాను  కుండపోత వర్షం కారణంగా  నాకు దారి కనబడలేదు. అందు వల్లే జరిగింది అని చెప్పి లొంగి పోయారు..”
” చిన్నారి సోనీ వాళ్ళ నాన్న ఆశ పడినట్టు బాగా చదివి డాక్టర్ అయింది. బంటి పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. విన్నీ లాయర్ అయింది.”

***

You May Also Like

One thought on “చిన్నారి సోని కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!