లవ్ యూ జిందగీ (సంక్రాంతి కథల పోటీ)

 లవ్ యూ జిందగీ
(తపస్వి మనోహరం సంక్రాంతి కథల పోటీ-2022)

రచన: ధనలక్ష్మి

చిన్న చిన్న కారణాలకు జీవితాలను అంతం చేసుకోకూడదు అనే తెలిపే కథ…

@@@@@@@@@@@@@@@

లక్కీ అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. వాళ్ళ నాన్న అయితే తను అమ్మే మళ్లీ కూతురి రూపంలో పుట్టిందని అమ్మ అని పిలుస్తుంటారు.. టెన్త్ స్కూల్ ఫస్ట్ వచ్చింది అని ఇప్పుడు పిల్లలు అందరూ ఫోన్లు వాడుతున్నారని తనకు ఒక ఫోను గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ నాన్న. డాక్టర్ చదవాలనే ది లక్కీ ఆశయం దానికి శ్రమిస్తూ ఉంటుంది నిరంతరం.స్నేహితులందరూ సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారని లక్కీ కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంది. అందరూ ఫోటోలు పెడుతున్నారు అని తను కూడా రకరకాల ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేసేది. తను అప్లోడ్ చేసే ఫోటోలకి లైకులు కామెంట్లు వస్తుంటే భలే ఆనందంగా ఉండేది తనకి. నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే అంతవరకు ఫోన్ లోనే గడిపేసేది లక్కీ. తన ఫోటోకి ఏంజెల్ అంటూ కామెంట్ పెట్టాడు నిఖిల్..
గుడ్ మార్నింగ్ అంటూ మొదలు పెట్టిన వాళ్ళ పరిచయం ఐ లైక్ యు, ఐ లవ్ యు చెప్పేంతవరకు పెరిగింది.నిఖిల్ మాటల మాయాజాలంలో పడిపోయింది లక్కీ. ఎంతగా అంటే చదివే ప్రపంచమనే తనకు నిఖిల్ ప్రపంచం అయ్యాడు.తన అడిగాడని పర్సనల్ ఫోటోలు ని పెట్టడం మొదలు పెట్టింది. ఒక రెండు రోజులు నిఖిల్ మాట్లాడడం మానేశాడు పదే పదే ఫోన్ చూసుకోవడం మొదలు పెట్టింది. పిచ్చి పట్టినట్టు అయిపోయింది తనకి ఆ రెండు రోజులు. అలా నిఖిల్ లక్కీని మానసికంగా కూడా లోబర్చుకోవడం మొదలు పెట్టాడు.ఇష్టముంటేనే ఫోన్ చేసేవాడు లేదంటే లేదు. మెసేజ్ కూడా చేసేవాడు కాదు. ఒకరోజు అతి ప్రేమ చూపించే వాడు ఇంకో రోజు అసలు మాట్లాడకుండా ఉండే వాడు.
ఓ రోజు ఆమెకి ఫోన్ చేసి నీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. డబ్బులు కోసం వేధించడం మొదలుపెట్టాడు.తను దాచుకున్న పాకెట్ మనీ ఇచ్చేది.. నిఖిల్ ఎక్కువ మొత్తంలో డబ్బు అడగడంతో ఇంట్లో తెలియకుండా తనకి గిఫ్ట్ గా వచ్చిన గాజులను అమ్మేసి డబ్బులు ఇచ్చింది…
ఒకరోజు నిఖిల్ హద్దుమీరి లక్కీని హోటల్ కి రమ్మన్నాడు. తన అమ్మ ,నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనుకుంది. నేను బ్రతికుంటేనే కదా నిఖిల్ నన్ను ఇలా వేధించేది.నేను చనిపోతే ఎలా నా వెంట పడతాడు. నాకు చావే శరణ్యము అనుకుని తన వోణి తీసుకుని ఫ్యాన్ కి ఉరితాడుగా బిగించుకుంది.
” అమ్మ! నీ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతావా…అన్న పిలుపుతో తన ప్రయత్నాన్ని విడిచి గుమ్మం వైపు చూసింది. అక్కడే నిలబడి ఉన్న వాళ్ళ నాన్నని చూసి పరిగెత్తుతూ వెళ్లి గట్టిగా హత్తుకొని తనివితీరా ఏడ్చి జరిగింది మొత్తం చెప్పింది..”
“అమ్మ ! ఇంత చిన్న విషయానికి ఎవరు అయిన చనిపోతారా..నా ఫ్రెండ్ పోలీస్. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు వాడికి చెప్పుతాను. వాడు చూసుకుంటాడు. నువ్వు భయం విడిచిపెట్టు అమ్మ.. ఎప్పుడైనా ఫంక్షన్ కి వెళ్తున్న గాజులు వేసుకో అని మీ అమ్మ అన్న మా నాన్న ఇచ్చిన గాజులు నేను ఎక్కడ పోగొట్టుకుంటానని భయంతో భద్రంగా దాచుకున్న నువ్వు. సైటు దగ్గర తాకట్టు పెట్టావని తెలిసింది. అంత డబ్బు ఎందుకు నీకు అవసరం అయిందో కనుక్కుందామని నీ రూమ్ లోకి వచ్చాను. నేను రావడం కాస్త ఆలస్యం అయినా నువ్వు మాకు దూరం అయ్యేదానివి అని లక్కీని హత్తుకుని ఏడ్చాడు వాళ్ళ నాన్న…”
“క్షమించు నాన్న! ఏం చేయాలో పాలు పోలేదు అందుకే చనిపోవాలనుకున్న…
“అమ్మ..ఇప్పుడే కాదు నీకు ఏ కష్టం వచ్చిన మాతో చెప్పుకో అంతే కానీ ఇలా ఎప్పుడు చేయకు.. తల్లి తండ్రులు బిడ్డల తప్పు చేస్తే కడుపులో దాచుకుంటాము. మా కళ్ళల్లో పెట్టుకుని మరీ చూసుకుంటాం.మేము బ్రతికేది మీకోసం.. మీరే దూరమైతే మరి ఎవరి కోసం బతకాలి చెప్పు..
ఇంకా ఎప్పుడూ నీ దగ్గర ఏది దాచిపెట్టను నాన్న.
లక్కీ ఇచ్చిన ఆధారాలతో నిఖిల్నీ వెతికి పట్టుకొన్నారు… విలాసాలకు అలవాటుపడి ఇలా అమ్మాయిలను ఫ్లర్ట్ చేసి, వారిని లోబర్చుకుని వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని విచారణలో తేలింది. నిఖిల్ ఫోన్ లో ఉన్న ఇతర అమ్మాయిల వీడియోలు ఫొటోలను డిలీట్ చేశారు..
“నాన్న నాకు ఈ ఫోన్ వద్దు దీని వల్లే కదా ఇదంతా జరిగింది”
“అమ్మ! కత్తి ఉంది అది కూరగాయలను తరగడానికి వాడవచ్చు. అలాగే పీకలు కోయడానికి వాడవచ్చు.అది వాడే విధానాన్ని బట్టి ఉంటుంది.అలాగే ఫోన్ ది తప్పు కాదమ్మా అది వాడిన విధానమే తప్పు.. ఈ ఫోన్ లో తెలియనివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. రాని వాటిని నేర్చుకోవచ్చు ,పదిమందికి తెలపవచ్చు , అంతా ఎందుకు నీలో దాగి ఉన్న ప్రతిభను పదిమందికి తెలియజేయవచ్చు… నీ వారి క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు..ఎన్నో జ్ఞాపకాలు పదిలంగా భద్రపరుచుకోవచ్చు.. టెక్నాలజీలో ఎప్పుడూ తప్పు లేదమ్మా అది వాడే మనిషి లో ఉంది.. నువ్వు వాడే ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ లో నీకు తెలియని విద్య నేర్చుకోవడానికి వాడు. ఫోటోలు అప్లోడ్ చెయ్ తప్పులేదు లైక్ కోసం ,కామెంట్స్ కోసం వేచి చూడొద్దు కామెంట్ చేసిన వారికి తిరిగి రిప్లై ఇవ్వు తప్పు లేదు కానీ ఏదీ కూడా శృతి మించకూడదు.. ఏదైనా హద్దుల్లో ఉంటే బాగానే ఉంటుంది హద్దు మీరితేనే తప్పులు జరుగుతాయి. డాక్టర్ అవ్వాలనేది నీ లక్ష్యం కదా దాని వైపు ప్రయత్నాలు మొదలు పెట్టు .ఫోన్ ఉపయోగించి తెలియనివి నేర్చుకో .బోర్ కొట్టినప్పుడల్లా నీకు కథలు కవితలు అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు సరదాగా మా మీద చెప్తూ ఉంటావు కదా. అలా కథలు కవితలు రాయడానికి ఆప్స్ ఉన్నాయి. అక్కడ రాయి ఫాలోవర్స్ గురించి పట్టించుకోకుండా నీకు నచ్చిన భావాలను రాసుకుంటూ పో.”ఫలితాన్ని ఆశించి పని మొదలు పెట్టకు, అలా అని వెనుకంజ వెయ్యకు…. నీ పని నువ్వు నిజాయితీగా చేయి…”
అలాగే నాన్న….! మీరు అన్నట్టే ఫలితాన్ని ఆశించను వెనుకంజ వేయను..
అప్పటి నుంచి లక్కీ తన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ, అప్పుడప్పుడు వ్యాపకంగా వ్యాసాలను అప్ లో రాస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఏ కష్టమొచ్చినా అమ్మా నాన్నకు చెప్పుకోవాలని.. అప్పుడే మనకు కలిగిన కష్టం నుంచి అమ్మానాన్న కాపాడి మన లైఫ్ ని రంగులమయం చేస్తారని అని తెలుసుకుంది లక్కీ.. లక్కీ రాసిన కవిత పేపర్లో రావడం, ఆ కవితకి మంచి పేరు రావడం.అంతేకాదు తన కవితకు బహుమతి రావడం చూసిన లక్కీ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందపడ్డారు. నాన్న లక్కీ వైపు గర్వంగా చూస్తుంది.
మీరు చెప్పింది నిజమే నాన్న ఫోన్ ని మనం ఎలాగైనా వాడవచ్చు.. అది వాడే మనలో ఉందని మీ వల్లే నాకు తెలిసింది… థాంక్యూ సోమచ్ నాన్న.. ప్రౌడ్ అఫ్ యు కన్న అని వాళ్ళ నాన్న అనడంతో లక్కీ కళ్ళలో ఆనంద భాష్పాలు వర్షించాయి.
తను రాసిన కవితని అన్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసింది..

//ఎంతవరకు ఈ బంధాలు..
ఎక్కడికి వరకు ఉంటాయీ ఈ బంధాలు..
ఎంత వరకు నీకు తోడు నిలుస్తాయి పేరు లేని బంధాలు…
అర్థం పర్థం లేని ఆలోచనలతో పయనం ఎంతవరకు
గమ్యం లేని ప్రయాణం ఎందుకు మొదలు పెట్టాలి

బహుశా మాటలు నీకు నచ్చవచ్చు
ఎంతవరకు నువ్వు అనుకూలంగా ఉన్నంతవరకు
వాళ్ళకి నచ్చినట్టు నువ్వు ఉన్నంతవరకు
వాళ్ళకి నువ్వు తగ్గట్టు ఉన్నంతవరకు
నీకు తోడుగా చరవాణి ఉన్నంతవరకు…
ఏ బంధాలు అయిన ఏ మాటలు అయిన
చరవాణి మాయలో పడిపోతూ
నీ చుట్టూన్న నీ లోకాన్ని మర్చిపోతే ఎలా..??

నీకు బాధ కలిగితే మందు అయ్యేది నీ వాళ్ళు
నువ్వు ఓడిపోతే అక్కున చేర్చుకునేది నీ వాళ్ళు
నువ్వు ఎలా ఉన్నా ఒప్పుకునేది నీ వాళ్ళు…
ఎవరికోసం నిన్ను నువ్వు తగ్గించుకుంటూ
నీకు నువ్వే ఏమి లేని వాడిలా ఎందుకు మారిపోతున్నావు..

పరిచయం అయ్యే ప్రతి బంధం
తీపి జ్ఞాపకాలను ఇస్తుంది అనుకోకు
ఎప్పటికీ కోలుకొని చేదు నిజాలను పరిచయం చేసి మరీ వెళ్తుంది…
నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో…
నీ పనిని, నీ చుట్టూ ఉన్న నీ వాళ్లను
పిచ్చిగా ఇష్టపడుతు సాగిపో…

ఏమి లేదు అనుకోకు .ఎవరు లేరు అనుకోకు
నీ చుట్టూ ప్రకృతి ఎదో ఒక రూపంలో ఉంటుంది
పంచభూతలు నీకు తోడుగా ఉన్నంతవరకు..
నువ్వు ఏకాకి ఎప్పటికీ కావు..
మాటల మాయాజాలంలో ఎప్పటికీ ఉండకు..
వాస్తవ జీవితంలో బ్రతకడం నేర్చుకో…//

లక్కీ వాళ్ళ నాన్న చెప్పినట్టు లైక్లు ,కామెంట్లు,షేర్ల గురించి పట్టించుకోవడం మానేసింది. తన పని తాను నిజాయితీగా చేస్తూ “ఐ లవ్ మై జిందగీ “అని తన జరిగినది కథగా రాసి పోస్ట్ చేస్తే అది కూడా సక్సెస్ అయి తనకి డబ్బుతో పాటు ఎంతో పేరును తీసుకుని వచ్చింది.
అటు తనకెంతో ఇష్టమైన డాక్టర్ చదువు చదువుకుంటూనే మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకుంది మన లక్కీ….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!