అల్ప సంతోషి
రచన: చింతా రాంబాబు
జన్మనిచ్చింది అమ్మయితే
ప్రపంచాన్ని పరిచయం
చేసింది నాన్న
వేలు పట్టి నడక నేర్పి
ఎంత కష్టాన్ని అయినా
చిరునవ్వుతో స్వీకరించి
కుటుంబ పోషణలో
నిరంతర శ్రామికుడిగా
బిడ్డల భవిష్యత్ కోసం
వెలుగై…
తను మైనంలా
కరిగిపోతూ…
కుటుంబ సంతోషాలే
తన సంతోషాలుగా…..
బిడ్డల ఆనందాలే
తన ఆనందాలుగా…
మురిసిపోతూ…
జీవనం సాగించే
అల్పసంతోషి నాన్న.!!
